TG-3277
Telugu

దేవుడు మనకు ఎల్లప్పుడ

Devudu Manaku Ellappudu

15
views
పల్లవి

దేవుడు మనకు ఎల్లప్పుడు (2) తోడుగ నున్నాడు (3) ఏదేనులో ఆదాముతో నుండెన్ (2) హానోకు తోడనేగెను (2) దీర్ఘ దర్శకులతో నుండెన్ (2) ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు దైవాజ్ఞను శిరసావహించి (2) దివ్యముగ నా బ్రాహాము (2) కన్న కొమరుని ఖండించుటకు (2) ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు యోసేపు ద్వేషించ బడినపుడు (2) గోతిలో త్రోయబడినపుడు (2) శోధనలో చెరసాలయందు (2) సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు ఎర్ర సముద్రపు తీరమునందు (2) ఫరో తరిమిన దినమందు (2) యోర్దాను దాటిన దినమందు (2) యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు దావీదు సింహము నెదిరించి (2) ధైర్యాన చీల్చినయపుడు (2) గొల్యాతును హతమార్చినయపుడు (2) సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు సింహపు బోనులో దానియేలు (2) షద్రకు మేషా కబేద్నెగో (2) అగ్ని గుండములో వేయబడెన్ (2) నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు పౌలు బంధించబడినపుడు (2) పేతురు చెరలో నున్నపుడు (2) అపోస్తలులు విశ్వాసులు (2) హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.