దేవుని సముఖ జీవ
Devuni Samukha Jeeva
దేవుని సముఖ జీవ కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) హత సాక్షుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) విజయవీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) సర్వోన్నతుని పురములలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2) ప్రార్ధన వీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2) పరిశుద్ధుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.