దేవుని స్తుతియించి
Devuni Sthuthiyinchi
దేవుని స్తుతియించి ఆరాధింతుము మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2) రండీ ఓ జనులారా సర్వలోక నివాసులారా (2) సంతోషగీతము పాడెదము (2) ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని||
వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2) ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2) ఆయనే రక్షించును ||రండీ ఓ||
బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2) శత్రువుల చెర నుంచి విడిపించెను (2) తోడుండి నడిపించెను ||రండీ ఓ||
మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2) వేదనలు శోధనలు ఎదిరించగా (2) శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ||
కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2) ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2) దిగులే మనకెందుకు ||రండీ ఓ||