దేవుని స్తుతియించుడి
Devuni Sthuthiyinchudi
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2) ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.