TG-3286
Telugu

దేవుని యందు భక్తి

Devuni Yandu Bhakthi

0
views
పల్లవి

దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||

1వ చరణం

ప్రార్ధన చేసి వీర వనితగా ఫలమును పొంది ఘనత పొందెను హన్నా వలె నీవు ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని||

2వ చరణం

ప్రభు పాదములు ఆశ్రయించి ఉత్తమమైనది కోరుకున్నది మరియ వలె నీవు ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని||

3వ చరణం

వినయ విధేయతలే సుగుణములై తన జనమును రక్షించిన వనిత ఎస్తేరును బోలి దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||