♪♫
TG-3288
Telugu
దేవునికి భయపడవా
Devuniki Bhayapadavaa
0
views
పల్లవి
దేవునికి భయపడవా మానవా నీ దేవునికి భయపడవా మానవా (2) పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2) యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి||
1వ చరణం
ఐగుప్తు మంత్రసానుల గమనించితివా రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2) దేవునికి విధేయత చూపిరి వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి||
2వ చరణం
నినెవె ప్రజలను గమనించితివా దేవుని మాటకు లోబడినారు (2) పాపమును విడిచి ఉపవాసముండి ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి||