TG-3290
Telugu

దేవునియందు నిరీక్షణ

Devuniyandu Nireekshana

0
views
పల్లవి

దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2) ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని||

1వ చరణం

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2) సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని||

2వ చరణం

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2) ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని||

3వ చరణం

తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2) తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని||

4వ చరణం

నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2) శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని||

5వ చరణం

పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2) కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని||

6వ చరణం

స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2) హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||