ధన్యము ఎంతో ధన్యమ
Dhanyamu Entho Dhanyamu
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము||
ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||
క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||
ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2) ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు||
ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2) అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు||
శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2) శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.