TG-5035
Telugu

దిగివచ్చిన దైవమా Dhigivacchina Daivama

Dhigivacchina Daivama

18
views
పల్లవి

Song: నిత్యుడైన దేవుడవు బలమైన దేవుడవు ఆలోచన కర్తవు సమాధాన కర్తవు . మా మధ్యకు దిగివచ్చిన మా దైవమా దైవత్వపు పరిపూర్ణత గల ప్రభువా  II2II 1. వాక్కైన దేవుడవు శరీరము దాల్చావు కృపా సత్య సంపూర్ణుడిగా మాకై దిగి వచ్చావు గొల్లల స్తోత్రమును జ్ఞానుల ఆరాధనను పొందుకున్న ఆరాధ్యుడా నీకే వందనం                   II 2II II మా మధ్యకు దిగివచ్చిన II 2. దేవదూత స్తోత్రములు నక్షత్రపు సూచనలు నీ రాకను సూచించిన మా దైవమా ప్రవక్తల ప్రవచనములు శిష్యుల సాక్ష్యములు నెరవేర్పుగా దిగివచ్చిన మా ప్రభువా                         II2II II మా మధ్యకు దిగివచ్చినII Song : దిగివచ్చిన దైవమా Dhigivacchina Daivama Lyrics & Tune : Pastor Israel Raju Sirra Vocals : Priscilla Israel Sirra Music : Prashanth Penumaka

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.