TG-3293
Telugu

యానించుచుంటిమి సిలువపై

Dhyaaninchuchuntimi Siluvapai

0
views
పల్లవి

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2) శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి||

1వ చరణం

తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో||

2వ చరణం

నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు (2) అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2) అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో||

3వ చరణం

ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడు (2) అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2) తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో||

4వ చరణం

దేవా నా దేవా నను విడనాడితివెందుకు చెవినీయవె నా ప్రార్థనకు (2) అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2) పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో||

5వ చరణం

సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని (2) అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2) జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో||

6వ చరణం

సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం (2) అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2) పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో||

7వ చరణం

నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని (2) అని విన్నవించావా విధేయత తోటి (2) తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||