TG-3294
Telugu

దిక్కులన్ని నీవేలే

Dikkulanni Neevele

0
views
పల్లవి

దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2) ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2) నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని||

1వ చరణం

లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2) నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2) చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని||

2వ చరణం

దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2) భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2) హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని||