♪♫
TG-3296
Telugu
దినదినంబు యేసుకు
Dinadinambu Yesuku
13
views
పల్లవి
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు||
1వ చరణం
మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు||
2వ చరణం
ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు||
3వ చరణం
దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు||
4వ చరణం
పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.