దినదినంబు యేసుకు - దగ్గరగా చేరుతా
dinadinanbu yeesuku - daggaragaa cheeruthaa
🎵 TG-1070🌐 Telugu
పల్లవి
దినదినంబు యేసుకు - దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసుని - నామదిలో కోరుతా ఎల్లప్పుడు యేసువైపు - కనులెత్తి పాడుతా ప్రభుని మాట నాదు భాట - విభుని తోనే సాగుతా ||దిన||
1వ చరణం
మారిపోయే లోకమందు - మనుష్యులెంతో మారినా మారునా ప్రభు యేసు ప్రేమ - ఆశతోడ చేరనా ||దిన||
2వ చరణం
దైవ వాక్యం - జీవ వాక్యం దిన దినంబు చదువుతా ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా ||దిన||
3వ చరణం
ఎన్నడు ఎడబాయడు నను - విడువడు ఏ మాత్రము ప్రభువే నాదు అభయము - భయపడను నేనేమాత్రము ||దిన||
4వ చరణం
పరిశుద్దముగా అనుకూలముగా - జీవయాగమై నిలిచెద సిలువ మోసి సేవ చేయ - యేసుతోనే కదులుతా ||దిన||