TG-3298
Telugu

దినమెల్ల నే పాడినా

Dinamella Ne Paadinaa

18
views
పల్లవి

దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల||

1వ చరణం

గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య ||దినమెల్ల||

2వ చరణం

నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2) ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) నేను పొందాలని ||దినమెల్ల||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.