దివిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టెనే
Diviloo Veeduka Ooranthaa Panduga Needee Raaraaju Puttenee
దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా మహా సంతోషమే - ఆహా ఆనందమే ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే ఇల మెస్సయ్య - జన్మించినాడుగా మన యేసయ్య - ఉదయించినాడుగా మహారాజు - మన యేసు నిన్నే కోరీ - ఇలా వచ్చెనే జగాలేలే - మన యేసు నిన్నే చేర - దిగి వచ్చెనే దేవ దేవుడే - మరియ తనయుడై ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై ప్రేమపూర్ణుడే - పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే దయతో దీపంగ నిలిచెనే ఆడే గొల్లలు - పాడే దూతలు వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని ఆ పశుపాకలో - పొంగే సంబరం మనకు రక్షణై - యేసు ఈ దినం పాపాన్ని తొలగించ వచ్చాడుగా నిను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.