TG-3300
Telugu

దివినేలు స్తోత్రార్హుడా

Divinelu Sthothraarhudaa

0
views
పల్లవి

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు – కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు (2) మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||

1వ చరణం

దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు||

2వ చరణం

సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||