పల్లవి
దివ్య పావనాత్మ, నీ యీవు లన్ని మంచివి నీదు ముఖ్యదానమీ -దివ్య ప్రేమయే-
1వ చరణం
ప్రేమ దయచూపును ప్రేమ దీర్ఘశాంతము మృతికన్న బలము -దివ్య ప్రేమయే- ||దివ్య పావనాత్మ,||
2వ చరణం
కాలజ్ఞాన మంతయు కొట్టి వేయబడును ప్రేమ నిత్య ముండును -దివ్య ప్రేమయే- ||దివ్య పావనాత్మ,||
3వ చరణం
దృష్టిగా విశ్వాసము మాఱఁగా నిరీక్షణ యనుభవమౌఁ గాని -దివ్య ప్రేమయే- ||దివ్య పావనాత్మ,||
4వ చరణం
విశ్వాస నిరీక్షణ ప్రేమ లీ మూడుండును కాని శ్రేష్ఠమయినది -దివ్య ప్రేమయే- ||దివ్య పావనాత్మ,||
5వ చరణం
పావనాత్మ! స్తోత్రము నీకుఁ జేయు వారము మాకు దయచేయుము -దివ్య ప్రేమయే- ||దివ్య పావనాత్మ,||