దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా
Divyatheejoomayaa Yeesayyaa Neethi Niyamaalaku Nilayamaa
దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నినునమ్ము నీజనుల - న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతికీర్తన 1. బలవంతుడా మహాశూరుడా - పలుశోధనలలో నాతోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన - నీ పాత్రగా నను మార్చినీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం - నాలో నీవే నీవే మహదానందం ||నిత్యం||
2. అభిషిక్తుడా నా ప్రాణేశ్వర- నా నీడవలె నాతోనుండి నను రక్షించి పోషించినావు నేనెన్నడూ నాకై ఆశించని - నీ దీవెనలతో తృప్తిపరచి నన్నీస్థితిలో నీవు నిలిపినావు నీవే నీవే నా ప్రాణం - నాలో నీవే నీవే నా ధ్యానం (2) ||నిత్యం||
3. నీ వాక్యమే నన్ను బ్రతికించెను - నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో మనైనది మన్నైపోవునని - నను జీవాత్మతో నింపినీవు నీ రూపుగా నను మార్చినావే నిత్యం నీతో నడుపుటకు - నీవు నాలో నాతో ఉన్నావే (2) ||నిత్యం||