♪♫
TG-4753
Telugu
ఎడబాయని దేవా ఇమ్మానుయేలు ప్రభువా
Edabaayani Deevaa Immaanuyeelu Prabhuvaa
20
views
పల్లవి
ఎడబాయని దేవా - ఇమ్మానుయేలు ప్రభువా మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా అ.ప: స్తుతులను చెల్లింతును - స్తోత్రములర్పింతును 1. నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా 2. నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము గడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో కాచిన దేవా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.