TG-3314
Telugu

ఏదో ఆశ నాలో

Edho Aasha Naalo

0
views
పల్లవి

ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య Pallavi: Edo Asha Nalo Nītone Jīvinchanī (2) Yērai Pāre Prēma Nālōnē Pravahinchinī Mitilēni Prēma Choopinchināvu Shruti Chēsi Nannu Palikinchināvu Ī Stōthragaana Nī Sontamē 1. Paravāsinanaina Kaḍupēdanu Nākēla Ī Bhāgyamu Paramandu Naaku Nī Swāsthyaṁ Nīvichu Bahumānamu (2) Tīrchāvulē Nā Kōrika Techānulē Chirukāṇuka Arpintunu Stutimālika Karūṇāmayā Nā Yesayya 2. Nī Pādasēva Nē Chēyanā Nā Prāṇamarpinchanā Nā Sēda Tīrchina Nī Kōsamē Ghanamaina Pratipādana (2) Prakāṭintunu Nī Shauryamu Keerṭintunu Nī Kāryamu Chūpintunu Nī Shaantamu Tējōmayā Nā Yesayya