ఎదురయ్యే శ్రమలలో జయమిచ్చే దైవమా
edurayyee shramalaloo jayamichchee daivamaa
ఎదురయ్యే శ్రమలలో జయమిచ్చే దైవమా బలమిచ్చి నడిపించే యేసయ్యా కష్టాల దారిలో కరుణించే తేజమై కృప చూపి దరిచేరే యేసయ్యా నీవు నాకుండగా నీవు నా అండగా నాకు భయమేల నా యేసయ్యా (2) నీవే నీవే నా బలము నీవే నీవే నీవే నా సమస్తము నీవే (2)
చేయ్యి జారిపోయిన నా జీవితమును చేయిపట్టిలేపి చేరదీసినావు అంధకారమైన నా బ్రతుకులో ఆశల జ్యోతివై తేజరిల్లినావు (2) నీకోసమే ఈ జీవితం నా సర్వము నీకంకితం నడిపించు నీలో అనునిత్యము
నీ నోటి మాటలే నా హృదయ ధ్యానమై నను నడిపించెనే జీవపు భాటలై దిక్కుదిశలులేని నా జీవితములో దిక్సూచివై నాకు దారి చూపినావు (2) అనుక్షణం ప్రతిదినం నీ రూపమై నీ సాక్షిగా ప్రకటింతు నిన్నే ఈ జగతిలో
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
