♪♫
TG-4759
Telugu
ఎదురు చూస్తున్నాను నా యేసయ్యా నీ రాక కోసమే
Eduru Choosthunnaanu Naa Yeesayyaa Nee Raaka Koosamee
0
views
పల్లవి
ఎదురు చూస్తున్నాను - నా యేసయ్యా నీ రాక కోసమే - నా మెస్సయ్యా (2) నువ్వొవస్తావనే - ఆశతో నేనున్నానయ్యా నీ రాకడ గురుతులు - నెరవేరెనయ్యా (2) అ.ప: రావయ్యా యేసయ్యా - జాగు చేయక నాకున్న ఆశలను - విసిగించక (2) ||ఎదురు||
1వ చరణం
లోకం జిగటగల దొంగ - ఊబిలా లాగుచున్నది జనుల పాపం నానాటికి - పెరిగి పోవుచున్నది (2) రాజ్యము మీదికి రాజ్యం - జనము మీదికి జనము బయలుదేరుచుండుటకు - సిద్ధపడుచున్నవి (2) ఎక్కడ చూచినా - భూకంపములే ఎక్కడ చూచినా - కరువు యుద్ధములే (2) ||రావయ్యా||
2వ చరణం
మధ్యాకాశం దూత శబ్ధం - ఆర్భాటముతో వినిపించగా సమాధులలో నిద్రించువారు - భక్తులు మొదట లేవగా (2) మేఘములమీద సంఘం - రెప్పపాటులో లేచి కొనిపోబడగా చూచి - ప్రలాపించెదరు (2) ఎక్కడ చూచినా - దౌర్జన్యములే ఎక్కడ చూచినా - అరాచకములే (2) ||రావయ్యా||