♪♫
TG-3315
Telugu
ఏడుస్తున్నాడేమో యేసయ్య
Edusthunnaademo Yesayya
0
views
పల్లవి
ఏడుస్తున్నాడేమో యేసయ్య ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2) (నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2) ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో||
1వ చరణం
నాడు నరుని సృష్టించినందుకు వారు పాపము చేసినందుకు (2) దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2) నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||
2వ చరణం
సౌలును రాజుగా ఏర్పరచినందుకు సౌలు హృదయము గర్వించినందుకు (2) దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2) నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||