TG-4770
Telugu

ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా

Ee Bhayamu Naaku Leeneeleedugaa Neevu Thoodundagaa

20
views
పల్లవి

ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా (2) ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి (2) ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా (2) గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా (2) ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద (2) ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా (2) ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా (2) నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా (2) ఆరాధన ఆరాధన ఆరాధన (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.