ఏ గుంపులో నున్నావో ఎరిగి
ee gunpuloo nunnaavoo erigi
ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో||
మరణమనెడి మొదటి గుంపు మారని గుంపు – నిర్జీవపు గుంపు దురాత్మ బలముతో తిరిగెడి గుంపు మెచ్చుఁకొనుట కిచ్చకంబు లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు చచ్చియుండిన సమాధుల గుంపు కరుణ లేక కఠినమైన కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు కరకు కల్గిన కఠోరపు గుంపు యేసు వాక్యమనగ నేమో ఎరుగని గుంపు – విననియ్యని గుంపు ముద్ర వేసిన మూర్ఖుల గుంపు ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు పరమ తండ్రి కడకు జేర పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు కావలి కాయు కఠినాత్ముల గుంపు సర్వ లోక మోసగాడు ఆది సర్పము – అదే ఘట సర్పము సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు వధువు మంద మేయు మర్మ మనగ గమనిక – గమనించి తెలుసుకో గదిలో చేరుకో పదిలపర్చుకో