ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

ee jeevitha eetha eedaleekunnaanu

🎵 TG-634💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధా

1వ చరణం

సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము ||ఈ జీవిత||

2వ చరణం

సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి సమాధానము నొసగ సరగున రావా ||ఈ జీవిత||

3వ చరణం

బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె బాధలన్నియు బావ బహుత్వరగ రావా ||ఈ జీవిత||

4వ చరణం

రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము ||ఈ జీవిత||

5వ చరణం

సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధానరాజ్యం స్థాపించరావా ||ఈ జీవిత||

6వ చరణం

మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ నాలుగవ జామున నడచివస్తున్నారా ||ఈ జీవిత||

7వ చరణం

పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్ ||ఈ జీవిత||

Report Error