TG-3319
Telugu

ఈ జీవితం విలువైనది

Ee Jeevitham Viluvainadi

0
views
పల్లవి

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం||

1వ చరణం

సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం||

2వ చరణం

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం||

3వ చరణం

పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||