♪♫
TG-4643
Telugu
ఈ జీవితమన్నది క్షణకాలమైనది
Ee Jeevithamannadi Kshanakaalamainadi
0
views
పల్లవి
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది (2) ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా (2) గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు (2) సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు (2) ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న(2) కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా(2) ||ఈ జీవితమన్నది||
1వ చరణం
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు (2) తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు |(2) ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న (2) కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా (2) ||ఈ జీవితమన్నది||