TG-4651
Telugu

ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ee looka yaatraloo nee saaguchunda

22
views
పల్లవి

ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2) ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2) అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)

1వ చరణం

జీవిత యాత్ర యెంతో కఠినము (2) ఘోరాంధకార తుఫాను లున్నవి (2) అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2) కాయువారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక||

2వ చరణం

హృదయము శుద్ధి పరచుకొన్నాను (2) నా చేతులెంతో పరిశుద్ధ పరచ (2) అనుకొనని రీతి అపవాదివచ్చి (2) నా జీవితమును నిరాశపరచె (2) ||ఈ లోక||

3వ చరణం

నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2) అనుదినము నన్ను ఆదరించెదవు (2) నీతో వున్నాను విడువలేదనెడు (2) నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక||

4వ చరణం

ఈ అనుభవముతో నేనడచు కొందు (2) ప్రియ యేసు వైపు నేను చూచుచు (2) గతమునంత నేను మరచిపోయెదను (2) కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు (2) ||ఈ లోక||

5వ చరణం

తోడైయుండెదవు అంతము వరకు (2) నీవు విడువవు అందరు విడచినను (2) నూతన బలమును నా కొసగెదవు (2) నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే (2) ||ఈ లోక||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.