TG-3317
Telugu

ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు

ee manchi leeni naapai neevu nee krupa choopi rakshinchinaavu

Blessing Kumarవిజయ్ · Vijayలిల్లియన్ క్రిస్టోఫర్ · Lillian Christopher
0
views
Chorus

ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు (2) ఇంతగ నన్ను హెచ్చించుటకు ఏ పాటివారము నా యేసయ్య (2) నీ కృపకు కృతజ్ఞులమై నా హృదిలోన నిన్ను నిలిపెద (2) ||ఏ మంచి||

1వ చరణం

లోకమంతయు వెలి చూపుతో నా అన్న వారే గేలి చేయగా (2) నా చెలిమి నీవై, నా కలిమిగా మారి, నా బలిమి నీవైతివే (2) యేసయ్య నిన్ను సేవింతును నీ సన్నిధిని నే విడువక (2) బ్రదికెద నీకోసమే (2) ||ఏ మంచి||

2వ చరణం

ఆదరణ లేని అనాధనుగా పరి పరివిధముల పరితపించగా (2) నా ధైర్యము నీవై శౌర్యముగా మారి సహకారి నీవైతివే (2) యేసయ్య నిన్ను సేవింతును నీ సన్నిధిని నే విడువక (2) బ్రదికెద నీకోసమే (2) ||ఏ మంచి||

3వ చరణం

గమ్యం లేక తిరుగుచుండగా గమనాగమనములు నిర్దేశించుచు (2) నా దరి నీవై నా గురిగా మారి నా మహిమ నీవైతివే (2) యేసయ్య నిన్ను సేవింతును నీ సన్నిధిని నే విడువక (2) బ్రదికెద నీకోసమే (2) ||ఏ మంచి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.