TG-1895
Telugu

ఈ మరణము కాదు శాశ్వతము

ee marannamu kaadu shaashvathamu

50
views
పల్లవి

ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము (2) యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ||ఈ||

1వ చరణం

జగతు పునాది వేయక ముందే మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ||ఈ మరణము||

2వ చరణం

యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు తిరిగి లేచెదరు యేసు నామములో కొలువు తీరెదరు పరలోకంలో కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును మరణము మబ్బులను కరిగించును వేదనలు రోదనలు రద్దు చేయును గతకాల సంగతులు గతించి పోవును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.