TG-324
Telugu

ఏ ముఖాంబుతోడ వత్తు యేసు

ee mukhaanbutooda vattu yeesu

193
views
పల్లవి

ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను ||ఏ ముఖాంబుతోడ||

1వ చరణం

నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె నిజముగా ||ఏ ముఖాంబుతోడ||

2వ చరణం

తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి పాలు కాకమునుపే ||ఏ ముఖాంబుతోడ||