TG-3097
Telugu

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో

ee naamamuloo srushti anta srujinpabadenoo

Daniel Prem Kumarఅను రాయ్ శామ్యూల్ · Anu Roy Samuelఅను రాయ్ శామ్యూల్ · Anu Roy Samuel
17
views
పల్లవి

ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడునో ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో ఆ నామమునే స్మరింతును

పల్లవి పూర్వ భాగం

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము ||ఏ నామములో||

1వ చరణం

రోగము తలవంచును నీ నామము యెదుట శాపము తలవంగును నీ నామము యెదుట (2) సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2) ||నీ నామమునే||

2వ చరణం

ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2) శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2) ||నీ నామమునే||

బ్రిడ్జి

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య కొనియాడబడును గాక నీ నామము యేసయ్య అన్ని నామములకు పై నామముగ (2) అన్ని నామములకు పై నామముగ (3) ||నీ నామమునే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.