ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో
ee reethi sthuthiyinthunoo - ee reethi seevinthunoo
🎵 TG-1036🌐 Telugu
పల్లవి
ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా - నాదు నజరేయుడా తీరము దాటిన వాడా - నాదు గలలీయుడా నాప్రాణ నాధుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా ||ఏరీతి||
1వ చరణం
వెదకినను, ఇల చేరితివి - వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి ||నాప్రాణ||
2వ చరణం
మహిమ నగరిని విడిచితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి ||నాప్రాణ||
3వ చరణం
ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతించుచు సాగెదను ||నాప్రాణ||