♪♫
207
views
పల్లవి
ఈ సంఘం పునాది క్రీస్తే సాధీశుఁడే దక్కించె యేసు దీని వాక్కాపుల్ రెట్టించే పై నుండి వచ్చి యేసు పెండ్లాడె నీమెనే కోరుచు రక్త మిచ్చి కొనె నీ కన్యనే
1వ చరణం
ఒక్కఁడే దేవుఁడిందు ఒక్క విశ్వాసము ఒక్కటే జన్మ మిందు ఒక్క కుటుంబము ఒక్క ప్రసాద విందు ఒకే సునామము నిరీక్షణొక్క టిందు నిరంత ప్రాప్తికే ||ఈ సంఘం||
2వ చరణం
అసత్య మార్గమంచు అనేకుల్ నవ్వినన్ విభాగ మై శ్రమంబుల్ విశేష మొందినన్ సుభక్తుల్ వేడుచుంద్రు అభయ కాంతికై యీ నింద లెల్లఁ బోయె ఆనంద నాటికై ||ఈ సంఘం||
3వ చరణం
కఠిన దుఃఖ బాధల్ కల్గిన నోర్చుచు విభ వానంద ప్రాప్తి లభింపఁ గోరుచు ఆ స్వర్గ పంక్తిఁజేరి యానంద మొందుచున్ యీ సంఘ మేసుఁ గూడి విశ్రాంతి బొందును ||ఈ సంఘం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.