ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా
ee sthitiloonainaa ninnu preemincheevaanigaa
ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా (2) అది మరణమైనను జీవమైనను శ్రమయైనను… అది బాధయైనను వేదనైనను కరువైనను…
నా తల్లే నన్ను మరిచిపోయినా నా తండ్రే నన్ను విడచివెళ్లిన నా స్నేహితులే నన్ను త్రొసేసిన నే ప్రేమించేవారికి దూరమైనా (2) విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్య తల్లి మరచినా మరచును, నన్ను మరువని యేసయ్య (2)
నా సొంతవారినే నే కోల్పోయిన నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన నాకున్న ఆశే నెరవేరకపోయిన నా హృదయంలో కలవరమే ఉన్ననూ (2) దేనికి భయపడక నే ముందుకే సాగేదా… నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద… (2) విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్యా తల్లి మరచినా మరచును నన్ను మరువని యేసయ్యా (2) నన్ను మరువని యేసయ్యా నన్ను మరువని ……………….యేసయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
