TG-2289
Telugu

ఈ ఉదయమున నీవు లేచి

ee udayamuna neevu leechi

35
views
పల్లవి

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ||

1వ చరణం

తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం (2) బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున||

2వ చరణం

అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు కాగా అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి ఏల బంధాలెల్ల వీడెగా ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం –