TG-3111
Telugu

ఏది సత్యం.. ఏదసత్యం..

eedi satyam.. eedasatyam..

Prakash Gantelaప్రకాష్ గంటల · Prakash Gantela
12
views
Chorus

ఏది సత్యం ? ఏదసత్యం ? శోధించి చూడు పరిశోధించి చూడు ఏది వాక్యం ? ఏది లౌక్యం ? తలంచి చూడు మది తలంచీ చూడు వక్త ఎవరు ? ప్రవక్త ఎవరు ? యుక్తితో చూడు నీ యుక్తితో చూడు పరమ ఆత్మ పరాయి ఆత్మ యోచించి చూడు వివేచించీ చూడు

1వ చరణం

లేఖనంబే మన ప్రమాణం లేదు వేరే సత్ప్రమాణం లేఖనంబే మన ప్రమాణం లేదు వేరే కొలమానం సత్య రూపం యేసే కాదా (2) సంఘమే సత్యస్థంభం కాదా ....

2వ చరణం

యేసు ప్రభుకే మన ప్రణామం క్రీస్తు రూపమే కీర్తనీయం (2) వ్యక్తి పూజ వద్దు మనకు (2) అహమునే ఆహుతీయలేమా

3వ చరణం

దైవ సేవే మన కర్తవ్యం ధనాపేక్ష ప్రభుకసహ్యం (2) సేవలోన వద్దు స్వార్థం (2) సిలువ త్యాగం స్ఫూర్తినీయదా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.