TG-175
Telugu

ఏమి లేదు సుమీ జగములో

eemi leedu sumee jagamuloo

203
views
పల్లవి

ఏమి లేదు సుమీ జగములో యేసుని ప్రేమ సారము కన్నను పామరం బేటికి వృధా కను దామరలు మూయగనె చీకటి యౌ మనంబున నెల్ల సత్యము గామి గని సర్వంబు విడువుఁ ||ఏమి లేదు||

1వ చరణం

దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచుఁ దద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమఁ గుందుచు భూరి మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు నాది నాదని యూరకే చెడిపోవ నేటికి ||ఏమి లేదు||

2వ చరణం

ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ మించు కైనఁ గలదా దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను నపుడే దయామృతవార్ధి దిక్కగు ||ఏమి లేదు||

3వ చరణం

జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణఁ జేయఁగా బడుఁ గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద హా భ్రమ నొంద నేటికి ||ఏమి లేదు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.