ఏమిచ్చినా నీ ఋణమును నే తీర్చలేను నా యేసయ్య
eemichchinaa nee runamunu nee teerchaleenu naa yeesayya
ఏమిచ్చినా నీ ఋణమును నే తీర్చలేను నా యేసయ్య ఏది జరిగానా నా జీవితానా నీ చిత్తమే నా నజరేయుడా (2) వేదనలైనా - శోదనలైనా - నిందలైనా - అవమానలైనా (2)
ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) ||ఏమిచ్చినా||
చెయ్యని నేరములెన్నో నను దోషిగ నిలిపిన వేళ ఘోరమైన అవమానాలే నా దరి నిలిచిన వేళ (2) ఆదరించావు - ఆశ్రయమైనావు (2) అవధులు లేని ప్రేమను అనుగ్రహించావు (2) ॥ఆరాధన నీకే॥
ఆత్మీయులైన వారే నను అపహాసించిన వేళ స్నేహితులైన వారే నను మోసము చేసిన వేళ (2) సాక్షిగా నిలిచావు - సహాయము చేసావు (2) సంతోష సమృద్ధితో నను స్థిరపరిచావు (2) ॥ఆరాధన నీకే ॥
కన్నీరే నా బ్రతుకులో నాట్యము చేసిన వేళ అంధకారమే జీవితాన్ని అలుముకున్న వేళ (2) నా దరి చేరావు - ధైర్యమునిచ్చావు (2) నీ ముఖ దర్శనముతో ధన్యుడను చేసావు (2) ॥ఆరాధన నీకే॥
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
