ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు
ekkaleenantha eththaina konda ekkinchu
ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు వారు లేరెవ్వరు కొండల తట్టు నా కన్నులెత్తి నిరాశలో నిన్నే పిలిచాను చీకటి తొలగించి నీ ప్రేమతోనే నా హృదయమును నింపావు లేఖనాలన్ని నెరవేర్చినావు యేసు రాజా నీవే నా ఆశ ఊహించలేని నీ గొప్ప కృపను సమృద్ధిగానే పొందితిని యుగముల రాజా మహిమను వీడి అవమానమునే భరియించావు సిలువలో నేను క్షమనే పొందాను నీ సొత్తుగా నన్నే మార్చావు నా రక్షకా నీ వాడను నేను హల్లెలూయా నిన్నే ఆరాధింతును హల్లెలూయా మరణమునే గెలిచావు బంధకాలను తెంచావు నీ నామములో రక్షణ (2) వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్ మరణముకు నాపై అధికారం లేదని మౌనమునే వీడి చాటించావు యేసు.. నీదే విజయము దేవా నీవే నా ఆశ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.