TG-4767
Telugu

ఎల్ రోయి వై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను

El Rooyi Vai Nanu Choodagaa Nee Darshanamee Naa Balamaayenu

15
views
పల్లవి

ఎల్ రోయి వై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్ రోయి వై నీవు నను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను ఎల్ రోయి వై నను చూడగా శత్రువే సిగ్గు నొందెను ||నీ ముఖ||

1వ చరణం

విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెను ఎల్ రోయి వై నను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను ||నీ ముఖ||

2వ చరణం

ఒంటరినై నేను నిను చేరగా నా పక్షమై నీవు నిలచితివే ఎల్ రోయి వై నను చూడగా శత్రువే పారిపోయెను ||నీ ముఖ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.