ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభుండా
ella veellalandu kasstalamandu vallabhundaa
ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప ||ఎల్ల వేళలందు||
విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల వేళలందు||
సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల వేళలందు||
జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ||ఎల్ల వేళలందు||
జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల వేళలందు||
నిత్యుడ నీవే నా సత్యుండ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల వేళలందు||
జీవము నీవే నా దేవుడు నీవే పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల వేళలందు||
కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల వేళలందు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.