TG-1486
Telugu

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి ప్రతి

ellappudunu prabhuvunandu aanandinchandi prathi

79
views
పల్లవి

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి ప్రతి సమయములోను… ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2) యెహోవా చేసిన మేలుల కొరకై ఎల్లప్పుడును ఆనందించండి ఆరాధించండి ||ఎల్లప్పుడును||

1వ చరణం

పాపంబు తోడ చింతించుచుండ నరునిగా ఈ భువిలో ఉదయించెగా మన పాప భారం తన భుజమున మోసి మనకై తన ప్రాణం అర్పించెగా ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును కలిగించే ఒక సాధనమై శోధనకు నిలిచి సహించిన వేళ జీవ కిరీటమును పొందెదము నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి మనతో నివాసమును కలిగి యుండుటకు త్వరలోనే రారాజుగా రానైయుండె శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.