TG-4769
Telugu

ఎల్రోయి ఎల్రోయి హలేలూయా ఎల్రోయి

Elrooyi Elrooyi Haleelooyaa Elrooyi

18
views
పల్లవి

ఎల్రోయి ఎల్రోయి హలేలూయా ఎల్రోయి (2) నను చూచిన యేసయ్య జ్ఞాపకాలు మదిలో మెదిలాయి నను కాచిన మెస్సయ తలంపులు నదిలా కదిలాయి (2) ||ఎల్రోయి||

1వ చరణం

గాఢాంధకారములో నీ కన్నులే నన్ను చూచాయి నీ వెలుగు మార్గములో నీ వాక్కులే నన్ను నడిపాయి నా కలమునుండి స్తుతి అక్షరాలు జాలువారాయి నా గళమునుండి స్తుతి కీర్తనలు నిన్ను చేరాయి (2) ( నాకల) ||ఎల్రోయి||

2వ చరణం

మరణాంధకారములో నీ కన్నులే నన్ను కాచాయి ఆయుష్షు ఆనందం నీలోనే నాకు దొరికాయి నా కనులనుండి స్తుతి భాష్పాలు పొంగిపొర్లాయి నీ హస్తమునుండి శుభదీవెనలు నన్ను చేరాయి (2) (నాకనుల) ||ఎల్రోయి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.