TG-3481
Telugu

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ

endakanee neenantee inta preema

Pranam Kamlakharజాషువు షైక్ · Joshua Shaikఅన్వేష్షా · Anwesshaa
0
views
Chorus

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ జడివాన లోయలో - ఎదురీత బాటలో ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య ||ఎందకనీ||

Verse 1

ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే గాలి వానై నాలో - నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా ||ఎందకనీ||

Verse 2

మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా ||ఎందకనీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.