TG-4701
Telugu

ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవెగా యేసు

Endina Edaari Brathukuloo Nindaina Aasha Neevegaa Yeesu

0
views
పల్లవి

ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు - నిండైన ఆశ నీవేగా తడబడెడు నా పాదములకు తోడు నీవే గదా యేసు - తోడు నీవే సదా ||ఎండిన||

1వ చరణం

ఎండమావులు చూచి నేను అలసి వేసారితి (2) జీవ జలముల ఊట నీవై సేద దీర్చితివి నా బలము నీవైతివే యేసు - బలము నీవైతివే నిత్య మహిమకు నిలయుడా నీ దివ్య కాంతిలోన (2) నీదు ఆత్మతో నన్ను నింపి ఫలింప జేసితివే నా సారధి నీవైతివే యేసు - సారధి నీవైతివే అంధకార లోయలెన్నో ఎదురు నిలచినను (2) గాయపడిన నీ హస్తమే నన్ను గమ్యము చేర్చును నా శరణు నీవే గదా యేసు - శరణు నీవే గదా ||ఎండిన||