ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
Endukoo Ee Preema Nanninthaga Preeminchenu
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2) ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2) ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో||
నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే అయినా నీవు క్షమియించినావే ఊహించని మేలులతో దీవించినావే నా సంకటములను కదా తీర్చినవే (2) ఏ యోగ్యత లేని దీనుడను ఏమివ్వగలను నీ ప్రేమకు (నా) సర్వం నీకే అర్పింతును (2) ||ఎందుకో||
మా కొరకు బలి పశువై మరణించినావు మా పాప శిక్ష తొలగించినావు పలు విధముల శోధనలో తోడైనావు ఏ కీడు రాకుండ మేము కాచినావు (2) రుచి చూపినావు నీ ప్రేమను ఆ ప్రేమలో నేను జీవింతును నీవే నాకు ఆధారము (2) ||ఎందుకో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.