TG-4763
Telugu

ఎన్నడు నెడఁబాయ నే కొలది

Ennadu Nedanbaaya Nee Koladi

0
views
పల్లవి

ఎన్నడు నెడఁబాయ నే కొలది విడనాఁడ ననిన తండ్రి నిరత మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు ||ఎన్నడు||

1వ చరణం

1.  పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు||

2వ చరణం

2.  ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు ||ఎన్నడు||

3వ చరణం

3.  తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు||