TG-3357
Telugu

ఎన్నిక లేని నాపై ఎంత

Ennika Leni Naapai

0
views
పల్లవి

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2) నీకే నీకే నీకే పాదాభివందనము నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక||

1వ చరణం

బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||

2వ చరణం

పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||